ఈసారి బోనాల బందోబస్తులో కిక్కిరిసిన జనాల మధ్య తిరిగే దొంగలను, చైన్ స్నాచర్లను ఇట్టే గుర్తించడానికి అత్యాధునిక AI కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేశారు హైదరాబాద్ సీపీ సజ్జనార్ . నేరస్థులు ఎవరైనా తప్పు చేయడానికి ప్రయత్నిస్తే క్షణాల్లో పట్టుకునేలా ఈ నిఘా వ్యవస్థ పనిచేస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీపీ సజ్జనార్. ఎంతో వైభవంగా జరుగుతున్న బోనాల వేడుకలపై సైబరాబాద్ , నగర పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు లేకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ కొనసాగుతోందని వెల్లడించారు. భక్తులు అందరూ పోలీసుల నియమ నిబంధనలకు సంపూర్ణంగా సహకరిస్తున్నారని, దీనివల్ల ఎలాంటి ట్రాఫిక్ లేదా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉత్సవాలు సాగుతున్నాయన్నారు.
ఈరోజు, రేపు కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది రెండు షిఫ్ట్‌ల వారీగా రౌండ్-ది-క్లాక్ బందోబస్తు నిర్వహిస్తున్నారని తెలిపారు.
